ఈ పాట 1983 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది. సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం. అనసూయాదేవి. ఇక దీని భావం విషయానికి వద్దాం. స్పష్టమైన టీక లేనప్పుడు చేస్తున్న స్థితగతిచింతనం ఇది. ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కారపు బాటలో నడిచిన పాట. 11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గూర్చి చెబుతుంటాయి. విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాలగురించి వివరిస్తుంటాయి. కొండొండోరి సెరువుల కింద (Click to listen) 1. కొండొండోరి సెరువుల కాడా సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి కాడి లేదు రెండు దూడాలే దు 2. కాడిదూడా లేనెగసాయం పండెను మూడు పంటాలొకటి వడ్లు లేవు రెండు గడ్డీ లేదు 3. వడ్లు గడ్డీ లేని పంటా ఇశాఖపట్నం సంతలో పెడితే వట్టి సం తేకానీ సంతలో జనం లేరు 4. జనంలేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి కాళ్ళు లేవు రెండు సేతుల్లేవూ 5. కాళ్ళు చేతులు లేని షరాబు తెచ్చిరి మూడు కాసూలొకటి వొలాల్లొల్లదూ రెండు సెల్లాసెల్లవు 6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు ఇజయ...