పద్యం1
పద్యం:-
సకల విజయముల్ నీకు కలుగు ప్రయత్నము మనకున్నన్
చికాకులేవి దరిచేరవు ఏకాగ్రత విల్లు ఎక్కు పెట్టినన్,
నీకు చింత ఎలా! దారిచూపు భారము తల్లి గాయత్రి
మక్కువతో తెలుపుతున్న జన్మదిన శుభాకాంక్షలు నేన్ ఈ పద్యమునన్
భావం:-
ప్రయత్నం చేయ విజయమును సిద్ధింప బడును, ఏకాగ్రతతో చికాకు దూరం అవును. సంక్షోభంలో దారి చూపేది దైవమే (ప్రకృతి)(గాయత్రి దేవి). ఇష్టము తో కర్తవ్యబోధ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను పద్య రూపములో.
పద్య లక్షణాలు:-
నాలుగు పాదాలు
ప్రాస నియమము ( ప్రతి పాదములో రెండవ అక్షర ' క ' )
చందస్సు:- లేదు
Comments
Post a Comment