ఈ శ్లోకాన్ని ఎటువైపు నుంచి చదివినా ఒకటే! – ఆశుకవిత్వం

ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ధ్వనించేలా పలికే ప్రక్రియను ఆంగ్లంలో palindrome అంటారు. అయితే ఆంగ్లంలో అలా పలికినప్పుడు ఎటునుంచి చదివినా అర్థంలో ఎటువంటి మార్పు లేకుండా ఒకేలా ధ్వనిస్తాయి. ఉదా: "Able was I ere I saw Elba" ఇది అంగ్లంలో తయారుచేయబడ్డ అతిపెద్ద palindrome. దీనికే వారు అంత అబ్బురపడిపోతే రెండు వేర్వేరు కావ్యాలను ఆవిష్కరించబడ్డ ఈ రామకృష్ణవిలోమ కావ్యం గురించి మనమెంత అబ్బురపడాలి. కేవలం అబ్బురమేనా! మనమెంత గర్వించాలి! కదా

14వ శతాబ్దపు శ్రీ దైవజ్ఞ సూర్య పండితులు వారు రచించిన ఈ "రామకృష్ణ విలోమ కావ్యం" మొత్తం 36 శ్లోకాలుగా ఉంది. మొదటి నుంచి చివరికి చదివితే రామాయణం, చివరి నుంచి మొదటికి చదివితే భారతం తెలియ చేస్తుంది. స్థూలంగా చూసినా, సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటి లోకీ ఉన్నతమైనది. భాషా వేత్తలంతా ముక్త కంఠంతో పలకగలిగే సత్యమిది.
తం భూసుతాం ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీః శ్రీయాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముంతా సుభూతం //1// చిరం విరంచి: న చిరం విరంచి: సాకారతా సత్య సతారకా సా  సాకారతా సత్య సతారకా సా  చిరం విరంచి: న చిరం విరంచి://2// తామ సీత్యసతి సత్యసీమతా  మాయయాక్ష మసమక్ష యాయమా  మాయయాక్ష మసమక్ష యాయామా  తామసీత్యసతి సత్య సీమతా //3// కా తపఘ్నీ తారకా ద్వా విపాపా  త్రేధావిద్యా నోష్ణ కృత్యం నివాసే  సేవా నిత్యం కృష్ణ నోద్యా విధాత్రే  పాపా విద్యాకార తాఘ్నీ పతాకా //4// శ్రీరామతో మధ్యమతో దియేన  ధీరో నిశం వశ్యవతీ వరాద్వా   ద్వారావతీ వశ్య వశం నిరొధీ  నయేదితో మధ్య మతో మరా  శ్రీ://5// కౌశికే త్రితపసి క్షరవ్రతీ  యో దదా  ద్వితనయ స్వమాతురం   రంతు మాస్వయన తద్విదాదయో  తీవ్ర రక్షసి పతత్రి కేశికౌ//6// లంబాధరోరు త్రయలంబనాసే  త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా  జ్ఞాతాగమా రక్షహి యాహియాత్వం  సేనా బలం యాత్ర రురోధ బాలం //7// లంకాయనా నిత్యగమా ధవాశా  సాకం తయానున్నయ  మానుకారా  రాకానుమా యన్నను యాతకంసా  శావా ధమాగత్య నినాయకాలం  //8// గాధిజాధ్వర వైరాయే  తే తీతా రక్షసా మాతా: తామ సాక్షరతా తీతే  యేరా వైర ధ్వజాధిగా: //9// తావదేవ దయాదేవే  యాగే  యావ దవాసనా  నాసవాదవ యాగే యా వేదే యాదవ దేవతా //10// సభాస్వయే భగ్నమనేన చాపం  కీనా శతాన ద్ధరుషా శిలా శైః  శైలా శిషా రుద్ధన తాశనాకీ  పంచాననే మగ్న భయే స్వభాస //11// నవేద యామక్షర భామసీతాం  కాతారకా విష్ణు జితే వివాదే  దేవావితే జిష్ణు వికారతాకా  తాం సీమభార క్షమయా దవేన //12//


తీవ్ర గోర న్వయత్రార్యో  వైదెహీ మనసో మత: తమ సోన మహీ దేవై ర్యోత్రా యన్వర  గోవ్రతీ //13// వేదయా పద్మసదనం  సాధారావ తతారమా  మారతా తవ రాధాసా  నంద సద్మప యాదవే //14// శైవతో హననే రోధీ  యో దేవేషు నృపోత్సవ: వత్స పోనృషు వేదే యో  ధీరో నేన  హతో వశై://15// నగోపగో సి క్షరమే పినాకే  నా యోజనే ధర్మ ధనేన దానం  నందాననే ధర్మ ధనే జయోనా  కేనాపి మే రక్షసి గోపగోన://16// తతాన దామ ప్రమదా పదాయ  నేమేరు చామ స్వన సున్దరాక్షీ  క్షీరా దసుం న స్వమచారు మేనే  యదాప దామ ప్రమదా నతాత: //17// తామితో మత్త సూత్రామా  శాపా దేష విగానతాం  తాం నగా విషదే పాశా  మాత్రా సూత్త మతో మితా //18// నాసావద్యా పాత్ర పాజ్ఞా వినొదీ  ధీరో నుత్యా సస్మితో ద్యావి గీత్యా  త్యాగీ విద్యా తోస్మి సత్యాను రోధీ  దీనోవి జ్ఞాపాత్ర పద్మావసానా //19// సంభావితం భిక్షుర గాదగారం  యాతాధిరాప స్వనఘాజ వంశ: శవం జఘాన స్వపరాది తాయా  రంగాదగార క్షుభితం విభాసం //20// తయాతి తార స్వనయాగతం మా  లోకాప  వాద ద్వితయం పినాకే  కేనాపి యం తద్విదవాప కాలో  మాతంగ యాన స్వరతాతి యాత://21// శవే విదా చిత్రకురంగ మాలా  పంచావటీ నర్మన రోచతేవా  వాతేచరో  నర్మ నటీవ చాపం  లామాగరం కుత్ర చిదా వివేశ //22// నేహ వా క్షిపసి పక్షికంధరా  మాలినీ స్వమత మత్త దూయతే  తే యదూత్తమ తమ స్వనీలిమా  రాధకం క్షిపసి పక్షివాహనే //23// వనాంత యాన స్వణు వేదనాసు   యోషామృతే రణ్య గతా విరోధీ  ధీరోవితా గణ్యరతే మృషాయో  సునాద వేణు స్వనయాతనాం వ://24// కిం ను తోయరసా పంపా  న సేవా నియతేన వై  వైనతేయ నివాసేన  పాపం సారయతో ను కిం //25// స నతాపతపహా తేన  స్వం శేనా విహితాగసం  సంగతాహి వినాశే స్వం  నేతేహాప తటాన స://26// కపితాల విభాగేన  యోషాదో నునయేన స: స నయే నను దోషాయో  నగే భావిలతాపిక://27// తే సభా ప్రకపివర్ణమాలికా  నాల్పక ప్రసర మభ్ర  కల్పితా  తాల్పిక భ్రమర సప్రకల్పనా  కాలిమా ర్ణవ పిక ప్రభాసతే //28// రావణే క్షిపతనత్రపానతే  నాల్పకభ్రమణ మక్రమాతురం  రంతు మాక్రమణ మభ్రకల్పనా  తేన పాత్రన తపక్షిణే వరా //29// దైవే యోగే సేవాదానం  శంకా నాయే లంకా యానే  నేయాకాలం యేనాకాశం  నందావాసే గేయోవేదై: //30// శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం   యానే నద్యా ముగ్రముద్యాన నేయా  యానే నద్యా ముగ్రముద్యాన నేయా  శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం //31// వా దిదేశ ద్విసీతాయం  యం  పాధో యనసేతవే  వేత సేన యధోపాయం  యం తాసీ ద్విశ దేదివా //32// వాయం జో నుమతో నేమే  సంగ్రామే రవితో హ్ని వ: వహ్నితో రమే గ్రాసం  మేనే తో మనుజో యంవా //33// క్షతాయ మా యత్ర రఘోరితాయు  రంకానుగానన్య వయో యనాని   నినాయ యోవన్య నగానుకారం  యుతారి ఘోరత్రయ మాయతాక్ష: //34// తారకే రిపురాప  శ్రీ: రుచా దాస సుతాన్విత: తనవి తాసు సదా చారు  శ్రీ పరా పురి కే రతా //35// లంకా రంకాగరాధ్యాసం  యానే మేయా కారా వ్యాసే  సేవ్యా రాకా యామే నేయా  సంధ్యా రాగా కారం కాలం //36// ॥ ఇతి శ్రీ దైవజ్ఞ పండిత సూర్యకవి విరచితం విలోమాక్షర రామకృష్ణ కావ్యం సమాప్తం ॥



ఇలా అక్షరాలతో ఆడుకోవటమనే ప్రక్రియ తెలుగు సంస్కృత భాషలలో అనేకం. కేవలం య ర ల వ శ ష స హ అనే ఎనిమిది అక్షరాలతో శేషశైల స్తుతి శ్రీ లీలావేలలల ల్లాలస వరవల్లవీ విలాస విలోలాలా శాలిహాసాస్య శశీవర శీలా శ్రీ శేషశైల శీర్షావాసా! క చ ట త ప అనే ఐదు వర్గ అక్షరాలకు చెందిన ఇరవై ఐదు అక్షరాల లో ఏవీ ఈ పద్య రచనలు ఉపయోగించలేదు. ఇలాంటి రచనలను అపంచవర్గీయ రచన అంటారు. గద్వాల సంస్థాన విద్వత్కవి కాణాదం పెద్దన సోమయాజి గారు శేషశైలేశలీల అనే పేరుతో ఒక కావ్యమే ఈ ఎనిమిది అక్షరాలతో రచించినారు. అయితే దురదృష్టవశాత్తు నేడు మనకు ఆ కృతి అలభ్యంగా ఉంది. గద్వాల కవివర్యుడు పోకూరి కాశీపతి గారు కాణాదం వారిని ఆదర్శంగా అపంచవర్గీయాక్షరాలతో "శౌరిశైశవలీల" అనే కృతిని రచించినారు. ఇది చాలా ఏళ్ల నాడు ముద్రితం కూడా. ఇలాంటి రచనలు ముక్కును మూసుకుని చదివినా కూడా నంగి లేకుండా స్పష్టంగా పలుకబడుతాయి. పరీక్షించాలి అనుకుంటే మీరూ గట్టిగా ముక్కును చేతితో బిగబట్టి పద్యాన్ని చదవండి స్పష్టంగా ఉచ్చారణ ఉంటుంది. దానికి కారణం పద్యంలోన అనునాసిక వర్ణాలు లేకపోవటమే.



RAO V K

Comments

Popular posts from this blog

Freedom at midnight

Trekking experience from Madhavadhara to Simhachalam at Visakhapatnam

Dr Brahma Reddy Vennapusa Speech