ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ధ్వనించేలా పలికే ప్రక్రియను ఆంగ్లంలో palindrome అంటారు. అయితే ఆంగ్లంలో అలా పలికినప్పుడు ఎటునుంచి చదివినా అర్థంలో ఎటువంటి మార్పు లేకుండా ఒకేలా ధ్వనిస్తాయి. ఉదా: "Able was I ere I saw Elba" ఇది అంగ్లంలో తయారుచేయబడ్డ అతిపెద్ద palindrome. దీనికే వారు అంత అబ్బురపడిపోతే రెండు వేర్వేరు కావ్యాలను ఆవిష్కరించబడ్డ ఈ రామకృష్ణవిలోమ కావ్యం గురించి మనమెంత అబ్బురపడాలి. కేవలం అబ్బురమేనా! మనమెంత గర్వించాలి! కదా 14వ శతాబ్దపు శ్రీ దైవజ్ఞ సూర్య పండితులు వారు రచించిన ఈ "రామకృష్ణ విలోమ కావ్యం" మొత్తం 36 శ్లోకాలుగా ఉంది. మొదటి నుంచి చివరికి చదివితే రామాయణం, చివరి నుంచి మొదటికి చదివితే భారతం తెలియ చేస్తుంది. స్థూలంగా చూసినా, సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటి లోకీ ఉన్నతమైనది. భాషా వేత్తలంతా ముక్త కంఠంతో పలకగలిగే సత్యమిది. తం భూసుతాం ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీః శ్రీయాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముంతా సుభూతం //1// చిరం విరంచి: న చిరం విరంచి: సాకారతా సత్య సతార...